Published 23 days ago • loading... • Updated 23 days ago
బీజేపీ కార్యాలయంలో దళిత కార్యకర్త సోఫాలో కూర్చున్నందుకు దాడి చేశారంటూ సంబంధంలేని పాత వీడియోని షేర్ చేస్తున్నారు
Summary
ఆగ్రాలోని బీజేపీ కార్యాలయంలో ఒక దళిత బీజేపీ కార్యకర్త సోఫాలో కూర్చున్నందుకు అక్కడున్న ఇతర నాయకులు అతనిపై దాడి చేశారంటూ ఒక వీడియో (ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.
ఆర్కైవ్ పోస్టుని ఇక్కడ చూడవచ్చు
క్లెయిమ్: ఆగ్రాలోని బీజేపీ కార్యాలయంలో సోఫాలో కూర్చున్న దళిత కార్యకర్తపై ఇతర నాయకులు దాడి చేస్తున్న దృశ్యాలు. ఫాక్ట్: ఈ వీడియో ఆగ్రా బీజేపీ కార్యాలయానిది కాదు. ఇది జూలై 2025లో మహారాష్ట్రలోని లాతూర్‌లో జరిగిన ఘటనను చూపుతుంది. ఒక ఎన్సీపీ మంత్రికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన ‘ఛావా సంఘటన్’ కార్యకర్తలపై ఎన్సీపీ నాయకులు చేసిన దాడికి సంబంధించిన దృశ్యాలివి. దాడికి గురైన వారు మరాఠా, ఓబీసీ వర్గాలకు చెందినవారు. కావున, పోస్టులో చేయబడిన క్లెయిమ్ తప్పు. ముందుగా, వైరల్ వీడియోలోని దృశ్యాలను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే వీడియోని చూపుతున్న జూలై 2025 నాటి పలు వార్తా కథనాలు (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) లభించాయి. వీటి ప్రకారం, ఈ ఘటన మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలోని ప్రభుత్వ వసతి గృహంలో జరిగింది.